ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహణ

గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహణ

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక – పీఎన్9 టీవీ తెలుగు న్యూస్, హైదరాబాద్ సిటీ బ్యూరో / జూన్ 08 2026: యాకుత్‌పురా నియోజకవర్గంలోని సరస్వతి నగర్‌లో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో తెరాస జెండా పండుగ సందర్భంగా గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని సరస్వతి నగర్ ఇంచార్జి కట్టల శారద ముదరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించగా, జెండా దిమ్మెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చార్మినార్ ఇంచార్జి రాధాకృష్ణ, బహదూర్‌పురా ఇంచార్జి సోను భాయ్, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే నందాల అనిల్ కుమార్, మణికొండ విజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా యువతకు రాజకీయాల్లో భాగస్వామ్యం కల్పించడం పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, సర్వోదయ తెలంగాణ నిర్మాణం కోసం పార్టీ కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ, తెలంగాణ ప్రజల అభ్యున్నతికి కట్టుబడి ఉంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, బాలమణి, చంద్రకళ, సునీతతో పాటు మహిళా నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!