పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 29 2026: తెలంగాణ రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా, వనపర్తి అభివృద్ధి ప్రదాతగా, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డిపై రూపొందించిన “వనపర్తి పొత్తిళ్లలో వేవిండో అడుగిలా ఆకుపచ్చ భూమిగా మార్చినులే వెలుగులా మా గడపలల్లో తొడిగిన తోరణమైనావుగా ఊరువాడకొచ్చిన పున్నమి వెలుగోలే”… ప్రత్యేక గీతాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి అభిమానుల ప్రోత్సాహంతో, పెద్దమందడి మండల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గట్టు రాజు, వనపర్తి మండల్ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు ఎత్తం చరణ్ రాజ్, దర్శకత్వంలో కళాకారుడు చంద్రశేఖర్, ఆజాద్, లు ఈ పాటను రూపొందించారు. ప్రజాసేవకు అంకితభావంతో అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్న డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి ప్రజలకు తమ వంతు సేవలందిస్తూ ప్రజా ఆశీర్వాదం పొందారని ఈ పాటలో ప్రస్తావించారు. “లీడర్లు, కార్యకర్తలే కాదు.. ప్రజలందరే నా కుటుంబం” అనే భావనతో వనపర్తి జిల్లాలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న నాయకుడిగా డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి నిలిచారని పాటలో పేర్కొనబడింది. ఈ గీతం ఆయన ప్రజాసేవా తపనను ప్రతిబింబిస్తోందని వనపర్తి జిల్లా ప్రజలు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. సొంత లాభాలను పక్కనపెట్టి ప్రజా సేవకే ప్రాధాన్యతనిచ్చే నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉండడం వనపర్తి ప్రజల అదృష్టమని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, సీనియర్ నాయకులు ఎంట్ల రవి, లోకేష్ అభిమానులు పాల్గొన్నారు.
