ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిశ్రీ చెన్నకేశవస్వామి ఆలయం వద్ద జమ్మి చెట్టు నాటిన గ్రామ సర్పంచ్, దేవాదాయ కమిటీ

శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం వద్ద జమ్మి చెట్టు నాటిన గ్రామ సర్పంచ్, దేవాదాయ కమిటీ

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 21 2026: పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామంలోని శ్రీ శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం వద్ద గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ మరియు దేవాదాయ కమిటీ అధ్యక్షులు పోతుల రాంరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం జమ్మి చెట్టు నాటారు. ప్రతి సంవత్సరం దసరా పండుగ సందర్భంగా జమ్మి పూజ కోసం గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తించిన గ్రామ సర్పంచ్, దేవాదాయ కమిటీ సభ్యులు ఈ నిర్ణయం తీసుకుని ఆలయ ప్రాంగణంలో జమ్మి చెట్టును నాటించారు. ఉదయం 8 గంటలకు ఆలయ పూజారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కను నాటారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పలుసు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… గ్రామ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను పరిరక్షించడంతో పాటు భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఈ జమ్మి చెట్టును నాటినట్లు తెలిపారు. దేవాదాయ కమిటీ అధ్యక్షులు పోతుల రాంరెడ్డి మాట్లాడుతూ… ఈ మొక్కను సంరక్షించి పెద్ద చెట్టుగా తీర్చిదిద్దేందుకు గ్రామస్థులంతా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్. రాములు, గొంది రామకృష్ణారెడ్డి, ఎం. బుచ్చన్న (బాబు), వడ్డె చంద్రయ్య, పోతుల ప్రతాప్, బోయిన్ కృష్ణయ్య, జి. బాలరాజు, గుర్రంగడ్డ చల్మారెడ్డి, మందడి బందన్న, రాములు యాదవ్, పోతుల ప్రవీణ్ కుమార్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శరత్ కుమార్ రెడ్డి తదితర గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!