ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిస్పూర్తి ప్రదాత చల్లా శివయ్య 

స్పూర్తి ప్రదాత చల్లా శివయ్య 

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 21 2026: జిల్లా విద్యాశాఖకు 37 సంవత్సరాల పాటు సేవలందించి ప్రధానోపాధ్యాయుడిగా ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన చల్లా శివయ్య చక్కటి స్పూర్తి ప్రదాత అని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. మంగళవారం వనపర్తి పట్టణంలోని ఆయన స్వగృహంలో శాలువ జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ… గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు గుణాత్మకమైన విద్యానందించడమే గాక ప్రధానోపాధ్యాయుడిగా పాఠశాలల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని తెలిపారు. ఇన్నాళ్ల తన ఉపాధ్యాయ జీవితంలో అటు విద్యార్థులకు ఇటు ఉపాధ్యాయులకు మార్గదర్శకుడిగా ఉంటూ ఉన్నతాధికారుల ప్రజా ప్రతినిధుల ప్రశంసలు అందుకున్నారని శంకర్ గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పానగల్లు ఎంఇఓ ఆనంద్, పిఆర్ టీయూ జిల్లా అధ్యక్షుడు బౌద్ధ రెడ్డి, కళావేదిక ప్రతినిధులు బైరోజు చంద్ర శేఖర్, దేశి రాములు యాదవ్, గంధం నాగరాజు, డా.బి.శ్యాం సుందర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!