ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదే కదా ? 

– పదేళ్లు బిఆర్ఎస్ పాలనలో 7 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏ ఒక్క రోజు కూడా ఒక్క రైతు కుటుంబాన్ని వద్దకు వెళ్లి పరామర్శించిన దాఖల లు లేవు,

– రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తూ ఈరోజు రైతులు గుర్తుకు రావడం హాస్యాస్పందం,పదేండ్లు రైతుల్ని మోసగించి ఇప్పుడు ఆక్రోషం ఎందుకు,

కారు కూతలు కూయడం మానుకోవాలి,

– కిసాన్ కాంగ్రెస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ రెడ్డి,

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 07 మే 2026: పదేళ్లు బిఆర్ఎస్ పాలనలో 7 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏ ఒక్క రోజు కూడా ఒక్క రైతు కుటుంబాన్ని వద్దకు వెళ్లి పరామర్శించిన దాఖల లు లేవని, రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తూ ఈరోజు రైతులు గుర్తుకు రావడం హాస్యాస్పందం,పదేండ్లు రైతుల్ని మోసగించి ఇప్పుడు ఆక్రోషం ఎందుకుకాని,ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదే కదాని, కారు కూతలు కూయడం మానుకోవాలని కిసాన్ కాంగ్రెస్ పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. గురువారం కిసాన్ కాంగ్రెస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ రెడ్డి వనపర్తి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంలో కిసాన్ కాంగ్రెస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… గత పదేళ్లు బీఆర్ఎస్ పాలనలో రైతు సంక్షేమాన్ని విస్మరించి నేడు రాజకీయ లబ్ధి కోసం సభలు పెట్టి రాహుల్ గాంధీ పై రేవంత్ రెడ్డి ల పై ఆక్రోశంగా ఆసభ్య పదజాలాలతో అనుచిత వ్యాఖ్యలతో కారు కూతలు కూయడం మానుకోవాలని అన్నారు.గత పదేళ్లు బిఆర్ఎస్ పాలనలో 7 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏ ఒక్క రోజు కూడా ఒక్క రైతు కుటుంబాన్ని వద్దకు వెళ్లి పరామర్శించిన దాఖల లు లేవని, ఇప్పుడు రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తూ ఈరోజు రైతులు గుర్తుకు రావడం హాస్యాస్పందమని అన్నారు.ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదే నని,ప్రాజెక్టుల ముంపు బాధితులపై అర్ధరాత్రి లాటి చార్జి జరిపించిన చరిత్ర బిఆర్ఎస్ దే, నేరెళ్ల లో దళిత రైతుల్ని వేధించిన చరిత్ర బిఆర్ఎస్ దే ఆ విధంగా రైతులని మోసాలు చేసి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై నోరు పారేసుకుంటే ఊరుకో బోంమని, రైతులను దగా చేసిన నీచ చరిత్ర మీదేనని,పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ రైతుల్ని ఉరి వేసుకునేలా వరి వేస్తే ఉరి అని మాట్లాడిన కేసీఆర్ దుష్ట పాలన చేసింది కాదాని ప్రశ్నించారు. పదేండ్ల బిఆర్ఎస్ పరిపాలనలో నాలుగుసార్లు రూ: లక్ష రుణమాఫీ చేసేందుకు నానా తంటాలు పడ్డి వడ్డీలకే సరిపెట్టింది నిజం కాదాని, వడగండ్ల వర్షాలతో పంటలు నష్టపోతే పదేండ్లు పైసా ఇవ్వకుండా పర్యాసం చేసింది నిజం కాదాని, ధరణి పేరుతో వేల మంది రైతుల ఉసురుపోసుకున్నది నిజం కాదాని, తాలు పేరుతో రైతులను మోసం చేసిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీది కాదాని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 28 నెలలలో 1.52 లక్షల కోట్లు ఖర్చు చేసిందని,25 లక్షల మంది రైతులకు రూ:21 వేల కోట్లతో ఏకకాలంలో రూ: 2 లక్షల రుణమాఫీ చేసి రైతులకు ఊరుట కల్పించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని అన్నారు. రైతులకు కౌలు రైతులకు ఏడాదికి 12, వేలతో రైతు భరోసా సాయం చేస్తున్నారు.వరివేసిన సన్న రకాల రైతులకు క్వింటాలుకు 500 బోనస్ ఇస్తున్నాడు.పంట నష్టపరిహారం కింద ఎకరాకు రూ10 వేల చొప్పున సాయం అందించారు. సబ్సిడీ ధరకు వ్యవసాయ యత్రిక పరికరాలు ఇస్తున్నారాని, పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని అన్నారు. రైతును రాజును చేయడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణలో తమ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉంటే బి ఆర్ ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని అన్నారు.కేటీఆర్ అహంకారాన్ని విడిచిపెట్టి రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ పెద్దమందడి అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు జానకి రాములు తదితరులు పాల్గొన్నారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!