ఫీజు రియింబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలి…

సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పెడుగులలోఉన్న విద్యార్థుల ఫీజులు.
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్
ఏ ఎస్ వై ఎఫ్ జిల్లా స్థాయి సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఓబయ్య..
సంవత్సరాలు గడుస్తున్నా విద్యార్థులకు రావాల్సిన 10 వేల కోట్ల రూపాయల ఫీజుల ను చెల్లుంచలేదని, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు చేటని ఏ ఎస్ వై ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఓబయ్యా అన్నారు. బుధవారం వారి కార్యాలయం లో జరిగిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజులు వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చిన లోకేష్ , ఇప్పుడు విద్యా శాఖ మంత్రి అయ్యి మూడు సంవత్సరాలు గడుస్తున్నా వేల కోట్ల రూపాయలు ఎందుకు పెండింగ్లో పెట్టారని ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వలన చాలా మంది విద్యార్థులు చదువులు పూర్తి చేసుకోలేక, సర్టిఫికెట్స్ తెచ్చుకోలేక అవస్థలుపడేది విద్యాశాఖ మంత్రి లోకేష్ కి తెలియదా అని ప్రశ్నించారు. జి. ఓ. నెంబర్ 77 ను రద్దు చేసి అందరికి ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నీట్ పరీక్షను ఎన్ టి ఏ ఆధ్వర్యంలో కాకుండా రాష్ట్ర ల వారీగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
నూతన కమిటీ ఎన్నిక…
ఏ ఎస్ వై ఎఫ్ నూతన జిల్లా అధ్యక్షులుగా సునీల్, ప్రధాన కార్యదర్శి గా ఆఫ్రిడ్, కోశాధికారుగా బాలాజీ, జిల్లా కమిటీ సభ్యులు గా ఏలీయా, సునీల్ ప్రశాంటూ హనీఫ్, గంగ సురేష్ లను ఎన్నుకున్నారు.
