డివైఎఫ్ఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి.
డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని.

బద్వేల్ పొలిటికల్ పవర్ నైన్ టీవీ తెలుగు ఎం వెంకటేశ్వర్లు కడప జిల్లా భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ కడప జిల్లా 8వ మహాసభలు ఆగస్టు నెల 10 11 వ తేదీలలో జమ్మలమడుగు పట్టణంలో నిర్వహిస్తున్నట్లు ఈ మహాసభలను జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని పిలుపునిచ్చారు. బుధవారం గోపవరం మండలంలోని డివైఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో యువకులతో కలిసి వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని మాట్లాడుతూ… డివైఎఫ్ఐ జిల్లా ఎనిమిదవ మహాసభలో జమ్మలమడుగు పట్టణంలో వేదిక గా మొట్టమొదటిసారి జరుగుతున్నాయని ఉన్నారు ఈ మహాసభలకు జిల్లాలో ఉన్నటువంటి నలుమూలల నుండి జిల్లా నాయకత్వం హాజరవుతారని వారు తెలిపారు ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకత్వం హాజరవుతుందన్నారు ఈ మహాసభలలో నిరుద్యోగ యువతీ యువకుల సమస్యలు అజెండాగా రూపొందించి ఈ మహాసభలలో చర్చిస్తామని వారు తెలిపారు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందు నిరుద్యోగ యువతీ యువకులకు అనేక హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు అందరికీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు యువతీ యువకుల హక్కులు సాధించాలంటే పోరాటమే మార్గమన్నారు అలాగే దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల సమస్యల పైన పోరాడుతున్నటువంటి ఏకైక యువజన సంఘం డివైఎఫ్ఐ సంఘమని వారు అన్నారు జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులు యువకులు పెద్ద ఎత్తున ఈ మహాసభలకు తరలివచ్చి ఈ మహాసభలను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ యువజన సంఘం నాయకులు బన్నీ రవితేజ చందు సురేష్ సాయి అఖిల్ సాయి తేజ వెంకటరత్నం రవికుమార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

