పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక /పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 30 2026: పెద్దమందడి మండలంలోని వెల్టూరు గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఎల్ఏ-2 లు, బీఎల్ఓ లకు ఘన సన్మాన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ దండు అశోక్ హాజరై సన్మాన గ్రహీతలను అభినందించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మల్లికార్జున్ మాట్లాడుతూ… ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు తక్కువ నీటితో సాగు చేసే పంటలను సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని పిలుపునిచ్చారు. ఎంపీడీఓ పరిణత మాట్లాడుతూ… వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి కుటుంబం ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతల తవ్వకాల్లో పాల్గొని ప్రభుత్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కె. రఘుపతి రెడ్డి, గొందే రఘువర్ధన్ రెడ్డి, జీపీఓ వెంకట్ గౌడ్, ఏపీఓ సురేష్, ఐకేపీ సీసీ బాలశివుడు, ఈసీ భాస్కర్, టీఏ రాఘవేంద్ర, బీఎల్ఓ సూపర్వైజర్ కరుణ, గ్రామ యువకులు కావలి వెంకటయ్య, బోయ బీమన్న, కావలి భగవంతు, బీఆర్ఎస్ నాయకులు మల్లక్ సురేష్, కాజా హుస్సేన్, ఐ. మధు, నూనె హనుమంతు, సి. నాగరాజు గౌడ్, గొల్ల సంజీవ్, సి. రంజిత్ కుమార్ గౌడ్, కుమ్మరి కొండన్న, తమ్మలి రాములు, బీఎల్ఓలు ఆవుల శాంత, ఎన్. నాగలక్ష్మి, సరస్వతి, జీపీ సిబ్బంది రుక్మాద్దీన్, శేఖర్ లతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
