ePaper
Monday, August 17, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఆడబిడ్డల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం-మాజీ ఎమ్మెల్యే మెచ్చా

ఆడబిడ్డల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం-మాజీ ఎమ్మెల్యే మెచ్చా

📰 Generate e-Paper Clip

ఆడబిడ్డలకు మేనమామలా ఎంతో మందికి పెళ్లి చేసిన నాయకుడు కెసిఆర్…పొలిటికల్ పవర్, ఆగస్టు 17:

అశ్వారావుపేట/దమ్మపేట కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కళ్యాణ లక్ష్మీ ,షాది ముబారక్ పథకాన్ని నిలిపివేయడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  ఆదేశాలమేరకు అశ్వారావుపేట,దమ్మపేట తహసిల్దార్ కార్యాలయాల ఎదుట అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు  నాయకులతో కలిసి నిరసన చేపట్టారు. డిమాండ్లతో కూడిన మెమొరండాన్ని డిప్యూటీ తాసిల్దారులకు అందజేశారు.

ఈ సందర్భంగా మెచ్చా  మాట్లాడుతూ దోచుకోవడం దోచుకోవడమే పనిగా ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు పెట్టుకున్నారని.ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేశారని.కోట్లాది సాధించుకున్న రాష్ట్రంలో ఈ ఆడబిడ్డ ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో ఒక మేనమామలా కెసిఆర్  కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతోమందికి ఆర్థికంగా సహాయపడ్డారని.2023 ఎన్నికల సమయంలో కెసిఆర్  కేవలం లక్ష మాత్రమే ఇస్తున్నారు నేను గెలిచిన రోజు నుంచి లక్షతో పాటి తులం బంగారం కూడా ఇస్తానని ఆడబిడ్డలను నమ్మబలికి నేడు అధికారంలోకి వచ్చాక హామీని అమలు చేయకపోగా..ఇప్పటికే అమలులో ఉన్న పథకాన్ని ప్రశ్నార్థకంగా మార్చేశారని.గ్రామాల్లో ఆడబిడ్డలు కాంగ్రెస్ నాయకులను నిలదీస్తుంటే ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకులు ఉన్నారని.తులం బంగారం భారం నుంచి తప్పించుకోవడం కోసమే ఈ పథకాన్ని నిలిపివేయడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పెండింగ్ లో ఉన్న అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఆలస్యం లేకుండా ఆర్థిక సహాయం విడుదల చెయ్యడంతో పాటు.హైకోర్టు కేసులో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై స్పష్టత ఇవ్వాలని.ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తులం బంగారం హామీని ఎప్పుడు,ఎలా అమలు చేస్తుందో స్పష్టమైన ప్రకటన చెయ్యాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు దొడ్డ రమేష్,మాజీ వైస్ ఎంపీపీ దారా మల్లిఖార్జునరావు గాజుబోయిన యేసు బాబు,రావుల శ్రీనివాసరావు, తుమ్మల లక్ష్మనరావు,యార్లగడ్డ శ్రీనివాసరావు,దేవరలపల్లి అజయ్ కుమార్,జలగం వాసు,చీకటి రామయ్య, గుత్తి శ్రీను,అబ్దుల్ జిన్నా, సర్పంచ్లు యాట్ల రాందాస్,కొమరం సుశీల,ఉప సర్పంచ్ రామకృష్ణ,వార్డ్ మెంబర్లు దారా రాము,రూప రాంబాబు,ఉయ్యాల లక్ష్మీనారాయణ, వెలుగోటి మహేష్,కాసిని శ్రీను,మద్దెల పుల్లారావు,పాశం ప్రసాద్,వల్లేపు నాగేశ్వరరావు,గుడిపూడి రవి, గొర్రెపాటి వెంకటేశ్వరరావు,కౌలురి నాగయ్య,గుమ్మడపు విష్ణు,మండవ సత్య,కోర్స వెంకటేష్,వాసం పండు,కౌలురి ఏసు,కందుకూరి రాంబాబు,గణేష్,అశోక్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!