ePaper
Thursday, August 20, 2026
📄 ePaper
Homeతెలంగాణఅశ్వారావుపేటపార్థివదేహానికి నివాళులర్పించిన బిఆర్ఎస్ నాయకులు సోయం వీరభద్రం

పార్థివదేహానికి నివాళులర్పించిన బిఆర్ఎస్ నాయకులు సోయం వీరభద్రం

📰 Generate e-Paper Clip

కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సోయం వీరభద్రం

పొలిటికల్ పవర్, ఆగస్టు 19:

ములకలపల్లి మండలం పాతూరు గ్రామానికి చెందిన కొండ్రు వసంత  గుండెపోటుతో మృతి చెందారనే విషయం తెలుసుకున్న  జిల్లా బీఆర్ఎస్ నాయకులు సోయం వీరభద్రం వారి స్వగృహానికి వెళ్లి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన సోయం వీరభద్రం, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వసంత మృతి కుటుంబానికి తీరని లోటని, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు. వసంత ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కొంతసేపు మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.కుటుంబానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో సోయం చిన్నారి, మిడియం రామయ్య తదితరులు పాల్గొని వసంత పార్థివదేహానికి నివాళులర్పించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!