ePaper
Thursday, September 17, 2026
📄 ePaper

స్థానిక పోరుకు సిద్ధం కావాలి ధర్మాన కృష్ణదాస్

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ ప్రతి నిధి  శ్రీకాకుళం జిల్లా

స్థానిక పోరుకు సిద్ధం కావాలి: ధర్మాన కృష్ణదాస్

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు.  టెక్కలి ఆదిత్య కళ్యాణమండపంలో టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శ్రేణులను సమాయత్తం చేసేందుకు, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. వైయస్ఆర్ సీపీ నాయకులకు ఇబ్బంది పెడుతున్న కూటమి నాయకులకు, అధికారుల పేర్లు నమోదు చేసే విధంగా జిల్లాలో డిజిటల్ బుక్ కమిటీ ఏర్పాటు చేశామని తెలియజేశారు. గ్రామ, వార్డు నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటికీ ప్రచారం ప్రారంభించి జగనన్న ఇచ్చిన సంక్షేమ ఫలాలు గుర్తు చేస్తూ కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రచార పుస్తకాలను పంపిణీ చేయాలని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, జిల్లా పరిశీలకులు కుంభ రవిబాబు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పిరియా విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్, వివిధ నియోజకవర్గాల పరిశీలకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు పాల్గొన్నారు.

Latest Articles

వీరాయిపల్లిలో వరి, వేరుశనగ పంటలపై క్షేత్ర సందర్శన

చీడపీడలు, వ్యాధులు, పోషక లోపాల గుర్తింపు.. రైతులకు శాస్త్రీయ సూచనలు పొలిటికల్...

ఆదివాసీ బెబ్బులి సోయం గంగులు త్యాగాన్ని స్మరించుకుందాం: సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. షాబీర్ పాషా

జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు దమ్మపేట...

అస్తవ్యస్త విద్యుత్ సరఫరాతో రైతులు ఆగం

  వెల్టూర్ సబ్‌స్టేషన్ ఎదుట మాజీ జడ్పీటీసీ రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నాపొలిటికల్ పవర్...

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి: -పలుస శంకర్ గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

ఎస్టీ కార్పొరేషన్ ఎక్కడ? బంజారా సమాజానికి మంత్రి పదవి ఎక్కడ?

బంజారాలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తే సహించేది లేదు ప్రభుత్వం సమాధానం చెప్పాలి:...

తెలంగాణ చరిత్ర ను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే : బీజేపీ కమలాకర్.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

Related Articles

బార్బర్స్ డే సందర్బంగా జండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు కడియాల సత్యనారాయణ

జూలూరుపాడు సెప్టెంబర్ 16: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్:వైరా నియోజకవర్గం జూలూరుపాడులో *బార్బర్స్ డే* సందర్భంగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో...

మానవత్వానికి నిదర్శనం- హర్ష కేతన్ ఫౌండేషన్ ప్రారంభం

*మధిర టౌన్ ఎస్ఐ నవిత చేతుల మీదుగా ప్రారంభోత్సవం*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డిసమాజ...

సెప్టెంబర్ 28న చలో కడప కార్యక్రమాన్ని విజయవంతం చేయండి సిపిఐ

 *సెప్టెంబర్ 27–30 సిపిఐ రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలి.సిపిఐ మండల కార్యదర్శి పెద్దులపల్లి ప్రభాకర్ పిలుపునిచ్చారు* ఈ నెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కడప నగరంలో నిర్వహించనున్న సిపిఐ...
error: Content is protected !!