ePaper
Thursday, November 5, 2026
📄 ePaper

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పెండింగ్ బిల్లులు త్వరగా చెల్లించాలి: ఎమ్మెల్యే జారె

📰 Generate e-Paper Clip

గృహనిర్మాణ సంస్థ చైర్మన్ పీవీ గౌతమ్‌ను కలిసిన జారె ఆదినారాయణ

పొలిటికల్ పవర్,అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్, ఎం. నాగార్జున,నవంబర్ 3: అశ్వారావుపేట నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు పెండింగ్‌లో ఉన్న తుది బిల్లులను త్వరితగతిన విడుదల చేయాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కోరార

ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్ పీవీ గౌతమ్‌ను ఆయన ఛాంబర్‌లో ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై చర్చించారు.

ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు తుది బిల్లులు అందకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే పథకం అమలులో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, పెండింగ్ బిల్లుల చెల్లింపులపై వివరించి, అర్హులైన పేదలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Latest Articles

మొగరలగుప్ప మూకమామిడి మధ్య వంతెన కూలిపోయి రాకపోకలకు అంతరాయం

వాగులో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన రెస్క్యూ  టీం మూకమామిడి ప్రాజెక్ట్ పూర్తిస్థాయి...

అలుగు ఉధృతికి రహదారి జలమయం.. భద్రాచలం మార్గంలో ట్రాఫిక్‌ నిలిపివేత

కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు అందుబాటులో డిడిఆర్ఎఫ్ బృందాలు:...

Related Articles

అలుగు ఉధృతికి రహదారి జలమయం.. భద్రాచలం మార్గంలో ట్రాఫిక్‌ నిలిపివేత

కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు అందుబాటులో డిడిఆర్ఎఫ్ బృందాలు: ఎస్సై సాయి కిషోర్ రెడ్డిపొలిటికల్ పవర్, ఆర్సి ఇంచార్జ్ ఎం.నాగార్జున,    అశ్వారావుపేట, అక్టోబర్ 4:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట...

కుర్చీకే పరిమితం కాని అధికారి.. ప్రజల మధ్యే దమ్మపేట తహశీల్దార్‌ మురళి

ఆపదలో ప్రజలకు అండగా.. ఆదర్శంగా నిలిచిన దమ్మపేట తహసిల్దార్! తుపాను వేళ క్షేత్రస్థాయిలో పర్యటన.. వరద బాధితులకు సహాయక చర్యలుదమ్మపేట, నవంబర్ 4: ప్రభుత్వ ఉద్యోగి అంటే కార్యాలయాలకే పరిమితమనే అభిప్రాయానికి భిన్నంగా, ప్రజల కష్టాల్లో...

తుఫాను వేళ ప్రజల చెంతకు.. మందలపల్లి సర్పంచ్, ఉప సర్పంచ్ చొరవ

వరద నీటితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు అండ పొలిటికల్ పవర్,దమ్మపేట, నవంబర్ 4: తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు దమ్మపేట మండలం మందలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాలు వరద నీటితో...
error: Content is protected !!