ePaper
Saturday, November 14, 2026
📄 ePaper

డిసెంబర్ 7న ప్రభుత్వ ఆసుపత్రుల కార్మికుల రాష్ట్రవ్యాప్త సమ్మె

📰 Generate e-Paper Clip

కాంట్రాక్టు విధానం రద్దు చేయాలి.. రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలి

రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని కార్మికుల డిమాండ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో భాజ శేఖర్ ఖమ్మం జిల్లా, నవంబర్ 14 2026: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న బెడ్‌సైడ్, పారిశుద్ధ్య, రోగుల సంరక్షణ, భద్రతా సిబ్బంది, పర్యవేక్షక కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 7న రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని ఖమ్మం జిల్లా ఎస్‌పీఎస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కరిష జగదీష్ వెల్లడించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన ఎస్‌పీఎస్ మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ సమావేశంలో రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు మాతంగి అనిల్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కరిష జగదీష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 400కు పైగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుమారు 20 వేల మంది కార్మికులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2022 జీవో నంబర్ 60 ప్రకారం రూ.15,600 వేతనం చెల్లించాల్సి ఉండగా, సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం రూ.10,500 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. పలువురు కార్మికులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించడం లేదని, కార్డులు కూడా అందజేయడం లేదని ఆరోపించారు. మహిళా కార్మికుల పట్ల కూడా కొందరు చులకనగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఖరారు చేసిన టెండర్ గడువు మూడేళ్లు దాటి మరో ఏడాదిన్నర గడుస్తున్నా ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. తక్షణమే కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి ప్రతి కార్మికుడిని ఐఎఫ్‌ఎంఐఎస్‌లో విలీనం చేయాలని, నెలకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. విధులకు వెళ్లే సమయంలో, తిరిగి వచ్చే సమయంలో లేదా విధి నిర్వహణలో ప్రమాదాలు జరిగితే కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ప్రతి కార్మికుడికి రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని ప్రభుత్వాన్ని, వైద్య ఆరోగ్యశాఖ అధికారులను కోరారు. కార్మికులకు వేతనాలు పెంచకుండా వెట్టి చాకిరీ చేయించుకోవడం, ఉద్యోగ భద్రత కల్పించకపోవడం వంటి సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో డిసెంబర్ 7న రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటారని రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు మాతంగి అనిల్ కుమార్ హెచ్చరించారు. ఈ సమావేశంలో ఖమ్మం జిల్లా ఎస్‌పీఎస్ ప్రచార కార్యదర్శి ప్రశాంత్, కమిటీ సభ్యుడు కోటమర్తి వెంకన్న, సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ అధ్యక్షురాలు ఇనపనూరి కుమారి, ఉపాధ్యక్షురాలు ఎస్.కె. కాసింబీ, సభ్యులు బి. శ్రీనివాసరావు, పి. మరియమ్మ, ఐ. వెంకటరమణ, బి. లక్ష్మి, జె. రాణి, ఈ. రాణి, జె. లక్ష్మి, ఐ. పద్మ, పి. ప్రశాంత్, వై. నాగమణి, షేక్ కాసింబీ, టి. కృష్ణవేణి, పి. సుకన్య, ఎస్. రావి, సి.హెచ్. నాగరాజు, కె. మహేశ్వరరావు, బి. రామతులసి, ఈ. జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

ఆత్మీయంగా సాగిన నిశ్చితార్థ వేడుక..నూతన జంటకు సోయం వీరభద్రం ఆశీస్సులు

 పొలిటికల్ పవర్,దమ్మపేట,నవంబర్ 14: దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామానికి చెందిన కూకలకుంట...

కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఫలించిన మంత్రి తుమ్మల కృషి

ఆరు ప్రాంతాల్లో సర్వేలు నిర్వహించి అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసిన ఎయిర్పోర్ట్...

ప్రజా పాలన ప్రభుత్వంలో మంజూరైన కొత్త పింఛన్లు

పొలిటికల్ పవర్ సమాగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9...

ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పట్టించుకోని ప్రభుత్వం

పొలిటికల్ పవర్ న్యూస్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్...

మంచి నీటి ఏద్దడి నివారణకు ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలి..

సిపిఎం పినిరెడ్డిగూడెం గ్రామ శాఖ కమిటీ డిమాండ్... పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

చిన్నారి వైష్ణవి ప్రాణాలకు ఆపన్నహస్తం అందించండి

గుండెలో రంధ్రం.. రూ.10 లక్షలతో హార్ట్ సర్జరీ.. వైద్య ఖర్చులు భరించలేక...

Related Articles

TUWJ-IJU మంచిర్యాల జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఓరగంటి సత్యనారాయణ ఏకగ్రీవ ఎన్నికనవంబర్ 14: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్మంచిర్యాల: తెలంగాణ రాష్ట్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్...

సీసీ రోడ్డుపై మురుగు నీటి ప్రవాహ తక్షణమే అధికారులు స్పందించాలి ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదు బీఆర్ఎస్ మండల అధ్యక్షుల చాపలమడుగు  రామూర్థి 

జూలూరుపాడు, నవంబర్ 13,( పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్ ):మండల కేంద్రమైన వెంగన్నపాలెం పరిధిలోని రావి చెట్టు బజార్ సీసీ రోడ్డుపై గత కొన్ని నెలలుగా...

*మావోయిస్టు ప్రభావం నుంచి అభివృద్ధి వైపు భద్రాద్రి కొత్తగూడెం.. నక్సల్ ముక్త్ భారత్‌పై PIB–జిల్లా పోలీసుల మీడియా సదస్సు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ రిపోర్టర్ సిహెచ్ కిషోర్*2014 నుంచి 2026 వరకు 829 మంది మావోయిస్టుల అరెస్ట్.....
error: Content is protected !!