ePaper
Monday, November 16, 2026
📄 ePaper

బియ్యం ధరలపై అధికారుల నిఘా.. దుకాణాల్లో ధరల పట్టిక తప్పనిసరి

📰 Generate e-Paper Clip

ప్రభుత్వ నిర్ణయించిన ధరలకే విక్రయించాలి.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

పొలిటికల్ పవర్,దమ్మపేట, నవంబర్ 16:ప్రజలకు బియ్యం ధరలు అందుబాటులో ఉండేలా, విక్రయాల్లో పారదర్శకత పాటించేలా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నవంబర్ 16వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్‌తో పాటు అశ్వారావుపేట, దమ్మపేట మండలాల డిప్యూటీ తహసీల్దార్లు, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, గ్రామ పాలన అధికారులు సంయుక్తంగా బియ్యం విక్రయ కేంద్రాలను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా బియ్యం విక్రయ వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే బియ్యాన్ని విక్రయించాలని అధికారులు సూచించారు. ప్రతి విక్రయ కేంద్రంలోనూ ప్రభుత్వం నిర్ణయించిన బియ్యం ధరల పట్టికను ప్రజలకు స్పష్టంగా కనిపించే విధంగా తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. నిర్ణీత ధరలకు మించి విక్రయించడం లేదా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడం జరిగితే సంబంధిత వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రభుత్వం నిర్ణయించిన బియ్యం ధరల వివరాలు (కిలోకు).

క్రమ సంఖ్యబియ్యం రకంధర
1BPT / KNMరూ.66/-
2RNR / తెలంగాణ సోనారూ.74/-
3HMT / JSRరూ.79/-

ఈ తనిఖీ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ గుండి రాజులు, అశ్వారావుపేట, దమ్మపేట మండలాల డిప్యూటీ తహసీల్దార్ బాదావత్ భద్రు, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు సోయం బిక్షమయ్య, వంకా వీరస్వామి, గ్రామ పాలన అధికారి కుంజా పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్…

 నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి. 16...

అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ రైళ్లు.. టౌన్ ప్లానింగ్ అధికారిణి నివాసంలో మెరుపు సోదాలు!

హైదరాబాద్ / రంగారెడ్డి జిల్లా (పొలిటికల్ పవర్ న్యూస్):అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమార్జనకు...

శ్రీశైల మల్లన్న అన్నప్రసాద వితరణకు రూ. 3.60 లక్షల విలువైన పచ్చళ్ల విరాళం.. దాతల ఔదార్యంపై ప్రశంసలు

నంద్యాల జిల్లా, శ్రీశైలం (నవంబర్ 16):ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం శ్రీ...

దేవనకొండ పంచాయతీ రాజకీయాల్లో కీలక పరిణామం: స్వతంత్ర అభ్యర్థిగా వైసీపీ నేత నామినేషన్

కర్నూలు జిల్లా, దేవనకొండ :పి దస్తగిరికర్నూలు జిల్లా దేవనకొండ మండల కేంద్రంలోని...

మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన ప్రజాప్రతినిధి.. వికలాంగుడు ఇంటికెళ్లి పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే జారె

అన్నివేళలా అండగా ఉంటానంటూ బాధిత కుటుంబానికి భరోసాపొలిటికల్ పవర్, అన్నపురెడ్డిపల్లి, నవంబర్16:ప్రజాప్రతినిధి...

Related Articles

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్…

 నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి. 16 నవంబర్ 2026. రుద్రూర్ మండల కేంద్రంలోని రాణంపల్లి గ్రామంలో బిజెపి కార్యకర్త జిలకర మహేందర్ తండ్రి జిలకర సాయిలు కొంతకాలంగా అనారోగ్యంతో...

మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన ప్రజాప్రతినిధి.. వికలాంగుడు ఇంటికెళ్లి పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే జారె

అన్నివేళలా అండగా ఉంటానంటూ బాధిత కుటుంబానికి భరోసాపొలిటికల్ పవర్, అన్నపురెడ్డిపల్లి, నవంబర్16:ప్రజాప్రతినిధి అంటే కేవలం అధికారాలకే పరిమితం కాకుండా.. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలిచి, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన ప్రజాసేవకు...

భద్రాచలంలో అక్రమ బహుళ అంతస్తుల భవనాలపై సమగ్ర విచారణ చేపట్టాలి

ప్రభుత్వ భూముల ఆక్రమణలు, భవన నిర్మాణ అనుమతుల వివరాలు బహిర్గతం చేయాలి 1950 నుంచి 2026 వరకు మేజర్ పంచాయతీ రికార్డులు అందించాలి.. డిప్యూటీ తహసీల్దార్‌కు జీఎస్పీ నాయకుల వినతిపొలిటికల్ పవర్, భద్రాచలం, నవంబర్...
error: Content is protected !!