కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీ లో చేరిన నాయకులు
కండువా కప్పి ఆహ్వానించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 05 మే 2026: పెద్దమందడి మండలం మనిగిళ్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంచరమోని వెంకటయ్య, సుంచరమోని తిరుపతయ్య, పెద్ది రాఘవేందర్ సాగర్ లు కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనను చూడలేక సొంత గూటికి చేరుకుని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వారికి పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానిస్తూ, పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మనిగిళ్ల గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ వెంట ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ రైతుబంధు అద్యక్షులు జగదీశ్వర్ రెడ్డి సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ పోతుల రామ్ రెడ్డి, రామకృష్ణ రెడ్డి, రాములు, శేఖర్ గౌడ్, దోడగుంటపల్లి శ్రీనివాస్ రెడ్డి, ముపూరి బుచన్న నర్సింహ గౌడ్, రామకృష్ణారెడ్డి రామిరెడ్డి, ప్రతాపరెడ్డి, చెన్నయ్య ఉప్పరి బోడి గణేష్, రాఘవేందర్, బోయిన్ మహేష్ మల్లికార్జున్ తిరుపతయ్య వెంకటయ్య, కృష్ణ బంధన్ కావలి ఉషాయ ఆనంద్ రెడ్డి, కొమ్ములయ్య, బాలరాజు, శ్రీకాంత్ రెడ్డి, బికే నాయుడు అంజి నాయుడు ముప్పూరి సాయికుమార్ ముప్పూరి మన్యం, ముప్పూరి రాజు ముప్పూరి పవన్ కుమార్, గుంటి శివకృష్ణ, మరియు గ్రామ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
