ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

వాల్మీకి బోయలకు అండగా ప్రభుత్వం
మండ్ల దేవన్ననాయుడు వాల్మీకి సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా కన్వీనర్

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 07 మే 2026: రాష్ట్రంలోని వాల్మీకి బోయలకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచిందని కాంగ్రెస్ నాయకుడు, వాల్మీకి సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా కన్వీనర్ మండ్ల దేవన్న నాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో వాల్మీకి బోయ సహకార కార్పొరేషన్ ఏర్పాటు చేసి,చైర్మన్ గా గట్టు తిమ్మప్ప, వైస్ చైర్మన్ గా బోయ నగేష్ లను నియమించి ప్రభుత్వం వాల్మీకి బోయలపై ఉన్న చిత్తశుద్ధిని చాటుతుందని దేవన్న నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, వనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంలో కెసిఆర్ వాల్మీకి బోయ కార్పొరేషన్ ఏర్పాటు కూడా చేయకుండా, ఎస్టీ జాబితాలో చేరుస్తామని మాట ఇచ్చి వాల్మీకి బోయలను నట్టేట మంచారని అంతేకాకుండా వాల్మీకి సమాజానికి తీవ్రంగా అన్యాయం చేశారని దేవన్న నాయుడు విమర్శించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీ సోదర సోదరులకు పార్టీ పెద్దపీట వెయ్యడం పట్ల దేవన్న నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అదే స్ఫూర్తితో వాల్మీకి బోయలను కూడా తిరిగి ఎస్టి జాబితాలో పునరుద్ధరించాలని ఆయన కోరారు. వాల్మీకి బోయ సామాజిక వర్గానికి ఆర్థిక సామాజిక అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి దోహద పడుతుందని దేవన్న నాయుడు ఆశాభవం వ్యక్తం చేశారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!