ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

నూతన ఎస్ బి ఐ కస్టమర్ సర్వీస్(సి ఎస్ పి) పాయింట్ ప్రారంభోత్సవం

ప్రారంభించిన ఒండ్రు మణిదీపు బ్రాంచ్ మేనేజర్, గ్రామ సర్పంచ్ బి దశరథరెడ్డి

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 07 మే 2026: అడ్డాకుల మండల కేంద్రంలో ఆర్టిసి బస్సు స్టాండు దగ్గర్లో వివేకానంద విగ్రహం వెనకాల ఎస్బిఐ బ్యాంకు ఆధ్వర్యంలో, కస్టమర్ సర్వీస్ పాయింట్ ను, గురువారం, అడ్డాకుల బ్రాంచ్ మేనేజర్ ఒండ్రు మణిదీప్, మరియు ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ బి దశరథ రెడ్డి కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా బి ఎం. మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంత ప్రజలకు వృద్ధాప్య, వృద్ధులకు, వితంతువులకుమరియు వికలాంగులకు ప్రతినెల వచ్చి పెన్షన్ కోసం, రైతు ఆగ్రో అగ్రికల్చరల్ లోన్స్, డైరీ ఫార్మ్స్, మరియు అమౌంట్ ట్రాన్స్ఫర్, డిపాజిట్, విత్ డ్రా, బ్యాంకు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అడ్డాకుల మండల, చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు, ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోగలరని తెలిపారు. మండల కేంద్రంలో ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని బ్రాంచ్ మేనేజర్ అన్నారు. గ్రామ సర్పంచ్: బి దశరత రెడ్డి మాట్లాడుతూ… అడ్డాకుల మండల కేంద్రం చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రతి వినియోగదారుడు ప్రభుత్వ పెన్షన్స్, రైతుబంధు, నగదు విత్ డ్రా, డిపాసిట్ చేసుకోవచ్చని తెలిపారు. ఎస్బిఐ కస్టమర్ సర్వీస్ పాయింట్ కు సిపిఎస్ ఆపరేటర్ గా, అడ్డాకుల గ్రామస్తురాలైన అక్తర్ సుల్తానా ను నియమిస్తున్నందుకు బ్రాంచ్ మేనేజర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని గ్రామ సర్పంచ్ బి దశరత రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఆహ్లాదకర వాతావరణంలో ఇప్పుడు బ్యాంకు సేవలు మరింత సులభంగా బస్టాండ్ కు దగ్గరలో ఎస్ బి ఐ అడ్డాకుల వినియోగదారుల సేవా కేంద్రం ఏర్పాటు చేయడమైనదని గ్రామ సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ సాయి సాగర్, మాజీ కో-ఆప్షన్ మెంబెర్ ఖాజా గోరి, మార్కెట్ డైరెక్టర్ శేఖర్ రెడ్డి, రాజు గౌడ్, నిరంజన్ గోరి, వెంకయ్య గౌడ్, శ్రీనివాస్ యాదవ్, సతీష్, హరీష్, జహంగీర్, పాల్గొన్నారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!