ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిఅజ్ఞానమనే అంధకారం నుండి విజ్ఞానంలోకి తీసుకెళ్ళేది గురువు మాత్రమే !

అజ్ఞానమనే అంధకారం నుండి విజ్ఞానంలోకి తీసుకెళ్ళేది గురువు మాత్రమే !

📰 Generate e-Paper Clip

– ఇప్పటి సమాజంలో  గురువు లేకపోతే చదువు, సంస్కారం, విలువలు అనే భావాలే ఉండవు,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి 
న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 30.2026.
తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే,గురువులు మనకు జ్ఞానమందిస్తారు. మనకు విద్యాబుద్ధులు నేర్పి, సంస్కారవంతంగా తీర్చిదిద్ది, అజ్ఞానమనే అంధకారం నుండి విజ్ఞానంలోకి తీసుకెళ్ళేది గురువు మాత్రమేనని, జ్ఞానానంద ధూపం సాంబశివుడు అన్నారు. బుధవారం గురుపౌర్ణమి సందర్భంగా వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని వడ్డే వాటా రోడ్డులో గల శ్రీ మహానంద మల్కి దేశి కేంద్రుల స్వాముల వారి అచల గురు ఆశ్రమం లో భక్తులు జ్ఞానానంద ధూపంసాంబశివుడు గురువు గారికి పాదపూజ చేసుకొని భక్తితో నమస్కరించారు. అనంతరంఈసందర్భంగాజ్ఞానానందదూపంసాంబశివుడుమాట్లాడుతూనాకువిద్య,బుద్దులునేర్పిసమాజంలోమంచిచెడులనుచూపిఉన్నతస్థాయికిఎదగడంలో తోడ్పడిన నా గురువులకు , నాకు జన్మనిచ్చి సమాజానికి నన్ను పరిచయం చేసి , సమాజాన్ని నాకు పరిచయం చేసి నన్ను సమాజ సేవకు సంకల్పించిన నా తల్లిదండ్రులకుహృదయపూర్వక గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.గురు బ్రహ్మా గురు విష్ణుః గురు దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మతస్మై శ్రీ గురవే నమః, తల్లిదండ్రుల తర్వాత మన జీవితాన్ని తీర్చిదిద్దే గొప్ప స్థానంలో గురువులు ఉంటారు. సమాజంలో గురువు లేకపోతే చదువు, సంస్కారం, విలువలు అనే భావాలే ఉండవు.మా గురువులు ప్రేమతో నేర్పిన పాఠాలు, అందించిన సంస్కారం, చూపిన మార్గదర్శకత్వం వల్లే ఈరోజు నేను ఈస్థాయిలోఉన్నాననిఅన్నారు.యేరుక యేట్టు ఉత్త్పత్తి యగు చున్న దనగ టెంకాయ లోనికి నీళ్ళు యేలా వచ్చు చున్నవో యేవరికి తెలియని రీతిన, వృక్షానికి కారణమైన నీరు కార్య రూపంగా కొబ్బరి చెట్టు యొక్క టెంకాయ లోకి ప్రవేశించి చున్నదో, అదే విధముగా, అనేక ఉపాధులకు కారణమైన యేరుక (ఆత్మ) కార్య రూపం దాల్చి ప్రపంచ చొత్త్పత్తి చెంది,  పిలువనిదే తనకు తానే ఎండమావుల లీలగా పరిపూర్ణ మందు తోయు చున్నదని,యేరుక యేలా పోవు చున్నదనగ యేనుగు కరణి మ్రింగిన వెలగపండు  యేనుగు యొక్క జఠరాగ్నిచే ద్రవ రూపముగా చెమ్మ టిల్లి యేనుగుకు ఆహారమై  నందు లోని గుజ్జు పదార్థ మంతయు నెట్టు హరించి పోవు చున్నదొ, అట్లే యేరుక తనకు తాను బయలు నందు లేకుండా పోవు చున్నదని అన్నారు. అట్టి గుజ్జు ఆహార పదార్థము సప్త ధాతువులుగా మారి యేనుగు పిల్లగా కరణిగా మరల తిరిగి జన్మకు వుపాధి లోకి వచ్చు  పద్ధతి యై యున్నదని, మరల తిరిగి జన్మకు రాని కరణి యేనుగు యింకొ కటి కలదు అది యేట్లనగా యేపుడైతే యేరుక గురు ముఖతః పరిపూర్ణ మున్నదని, గుర్తెరిగి, తన గుర్తు కల్లయని యీ యేరుకే భస్మా సురుని వలె భస్మమై పోయి తిరిగి జన్మకు రాని పద్ధతి కలదు.  భస్మాసురుడను రాక్షసుడు ఎవరి నెత్తిపై తన చేయి నుంచనో వాడు భస్మమై పోవునట్లు వరమొంది, యావరమోసంగిన పరమేశ్వరునిపరీక్షించిచేయబూని,తుదకుమోహనివేషధారియగువిష్ణుమూర్తివల్లమోసపోయి, తన శిరస్సుపై తానే చేయి నుంచుకొని తానే భస్మమై పోయెనని,యేరుక యేపుడైతే గురు ముఖతః పరి పూర్ణంను పొడ గాంచిన, తన గుర్తు మృశై తాను పరిపూర్ణ మందు తిరిగి తోయ రాని పద్ధతియై యున్నదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో
కుమారస్వామి, శివరాములు, సహదేవుడు, ఈర న్న, కృష్ణయ్య, శ్రీనివాసులు, చంద్రమౌళి, మణెమ్మ,
వెంకటమ్మ, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!