పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 21 2026: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్నినో కమిటీకి ఛైర్మన్గా డా. జి. చిన్నారెడ్డిని నియమించిన సందర్భంగా వనపర్తి జిల్లా వికలాంగుల కమిటీ అధ్యక్షుడు గంజాయి రమేష్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు డా. చిన్నారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయ రంగానికి ఉపయోగపడే విధంగా ఎల్నినో కమిటీ సమర్థవంతంగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా మాజీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ ఎం. దేవన్న యాదవ్, మాజీ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మున్నూరు జయకర్, అజీమ్, వీరయ్యపల్లి శ్రీనివాసులు తదితరులు పాల్గొని డా. జి. చిన్నారెడ్డిని అభినందించారు.
