ePaper
Monday, June 15, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంగుర్తింపు లేని పాఠశాలల వివరాలను విద్యాశాఖ అధికారులు వెల్లడించాలి

గుర్తింపు లేని పాఠశాలల వివరాలను విద్యాశాఖ అధికారులు వెల్లడించాలి

📰 Generate e-Paper Clip

ఖమ్మం పట్టణంలో పుట్టగొడుగుల్లా ప్లే స్కూల్స్, ప్రీ స్కూల్స్ ఏర్పాటు.

అధిక ఫీజులు, అడ్మిషన్ ఫీజు,

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి జూన్ 15 2026: ఖమ్మం పట్టణంలో బుక్స్ యూనిఫామ్స్ పేరిట, విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని తాగుతున్న పాఠశాల యాజమాన్యాలు విద్యాశాఖ వెంటనే చర్యలు తీసుకోవాలి. అనుమతి లేని పాఠశాలను మూసివేయాలి.

మహమ్మద్ అబ్దుల్ రహీం. జిల్లా ఉపాధ్యక్షుడు

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఐ యు యంల్ పార్టీ ఖమ్మం జిల్లా. ఖమ్మం పట్టణంలో పుట్టగొడుగుల్లాగా పాఠశాలలు ఏర్పాటు అయ్యాయని, కనీసం అనుమతులు లేకుండా ప్రారంభించి నడుపుతున్నా, విద్యాశాఖ అధికారులు కనీసం పట్టించుకోవడంలేదని వాటిపై చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారని, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఐ ఎల్ పార్టీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ రహీం ఆరోపించారు. అధిక ఫీజులు, అడ్మిషన్ ఫీజు, యూనిఫామ్, బుక్స్ ల పేరిట ఫీజులు వసూలు చేస్తూ, విద్యను వ్యాపార రంగంగా మార్చారని, ఆయన అన్నారు. కనీసం అనుమతులు లేకపోయినా కూడా పాఠశాలల ఏర్పాటు చేశారని, ఫైర్ సేఫ్టీ, అనుమతులు కాని, తరగతి గదుల వైశాల్యం, గాలి వెలుతురు లేని పాఠశాల గదులు,రెండు మూడు అంతస్తుల భవనాలు తీసుకొని యాజమాన్యాలు చిన్న పిల్లలకు ప్లే స్కూల్స్ ప్రీ స్కూల్స్ పాఠశాలలు నిర్వహిస్తూ, వాళ్లను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని, ఆయన అన్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఖమ్మం పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లేని పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించవద్దని, పూర్తిస్థాయిలో వివరాలు కనుక్కొని అనుమతులు ఉన్నాయా లేవా, ఫైర్ సేఫ్టీ ఉన్నదా లేదా, పాఠశాలలో తగిన వాతావరణం, గాలి వెలుతురు, తగిన విధంగా తమ పిల్లలకు అనుకూలంగా ఉందా లేదా అనే విషయాలను గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకొని తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని, ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా, గుర్తింపు ఉన్న పాఠశాలలు ఏవి గుర్తింపు లేని పాఠశాలలు ఏవో జాబితాను ఖమ్మం జిల్లా విద్యార్థుల తల్లిదండ్రులకు బహిరంగపరచాలని, అదేవిధంగా అనుమతి లేని, ప్లే స్కూల్స్ ఫ్రీ స్కూల్స్,ను వెంటనే మూసివేసే విధంగా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఐ యు ఎం ఎల్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ రహీం డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!