ePaper
Friday, October 30, 2026
📄 ePaper

*మట్టిలో పుట్టాం… మట్టిలో కలవాలి… మధ్యలో అహంకారం ఎందుకు…???

📰 Generate e-Paper Clip

 

సూర్యుని ప్రయాణం _”చీకటి”_ పడేవరకు… చంద్రుని ప్రయాణం, పగలు వచ్చేంతవరకు… అలల ప్రయాణం తీరం చేరేవరకు… మంచి స్నేహితునితో ప్రయాణం మనం జీవించి ఉన్నంతవరకు.

జనం ఎంత సులభంగా మనలను పొగుడుతారో. అంతే సులభంగా నిందిస్తారు కూడా… కాబట్టి, నింద పొగడ్తలను పట్టించుకోకుండా మామూలుగా జీవించడానికి ప్రయత్నిస్తే _”ఆనందం”_ మన సొంతమవుతుంది.

నీతులు నీడని ఇవ్వకపోవచ్చు కానీ నిజాయితీగా బ్రతికేలా చేస్తాయి. సామెతలు సంపదని ఇవ్వకపోవచ్చు కానీ ఆలోచనలు జోడిస్తాయి. కొటేషన్లు కోరికలు తీర్చకపోవచ్చు కానీ కొత్త అర్ధాన్ని చెబుతాయి. మంచి మాటలు మరణాన్ని ఆపలేవు కానీ శాంతిని కలిగేలా చేస్తాయి.

వేల కోట్ల సంవత్సరాల ప్రయాణం తర్వాత, ఈ విశ్వం మనిషి మేధస్సుని _”నేను ఎవరు?”_ అని అడిగేలా చేసింది.

మనిషికి తప్ప మరే ప్రాణికి _”నా కర్తవ్యం ఏమిటి, నా గమ్యం ఏమిటి?”_ అనే తలంపు రాదు.

దేవుడికో లేదా విధికో తెలుసు ఏమి జరుగుతుందో, ఏమి జరగాలనుందో…

తగిన సమయంలో జరిగేది జరుగుతుంది.

బాట ఎన్నో వంపులతో ఉండవచ్చు, గుంటలు గతుకులు ఉండవచ్చు…

ఐనా ఆ మార్గం అందమైన ప్రదేశానికే చేరుస్తుంది. అలాగే జీవితంలో కష్టనష్టాలకు చింతించకు, ఆగకుండా ముందుకు సాగు… ఆనందాన్ని చేరుకుంటావు.

పాము నీకు దూరంగా ఉంటే నిన్ను కాటువేయలేదు… అలాగే దుష్ట విషయాలకు దూరంగా ఉంటే నీకు హాని జరగదు.

కుండను అడిగారట _”ప్రతి పరిస్థితిలో శాంతంగా ఎలా ఉంటావని?”_

కుండ చెప్పిందట… _”మట్టిలోంచి వచ్చానని, తిరిగి మట్టిలో కలిసిపోతానని గుర్తుంచుకుంటాను… ఇంకెందుకు గర్వం, కోపం.”_

శ్మశానం చూస్తే ఒకటే గుర్తుకు వస్తుంది…

మనిషి బూడిదవడానికి, జీవితమంతా ఇతరులను చూసి అసూయతో తపిస్తున్నాడని.

నలభై ఏళ్ల వరకు నీ ముఖం తల్లిదండ్రుల పోలిక… నలభై దాటాక నీ ముఖం నీవు చేసిన పనుల ప్రతిబింబం.

పుట్టినప్పుడు పంచే మిఠాయి, చచ్చినప్పుడు వడ్డించే పాయసం ఆ వ్యక్తి తినలేడు… అతను రాజైనా, ఫకీరైనా… _ఇంక అహంకారం ఎందుకు?_

Latest Articles

వెలుగుమట్ల కాలనీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు నవంబర్ నెలాఖరు లోగా పూర్తి చేయాలి: మంత్రి తుమ్మల

వెలుగుమట్ల కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆకస్మికంగా పరిశీలించిన మంత్రిపొలిటికల్ పవర్...

నగర అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.. మంత్రి తుమ్మల

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి భవన నిర్మాణ...

జూలూరుపాడు మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించకపోవడంపై మండల సిపిఐ సమితి ఆగ్రహం 

 జూలూరుపాడు అక్టోబర్ 29: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక...

మార్కెట్ కమిటీపై తప్పుడు ప్రచారం మానుకోవాలి:సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి భూక్య శ్రీను నాయక్

కొత్తగూడెం, అక్టోబర్ 29 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక...

భద్రతా చర్యలు పాటించకుండా నివాస ప్రాంతంలో భారీ మొత్తంలో టపాసుల అక్రమ నిల్వ ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

మేడిపల్లి: 29 అక్టోబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ,మేడిపల్లి పోలీస్...

Related Articles

పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ పై SEC కి పిర్యాదు చేసిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* ఆయన బాధ్యతలు తీసుకున్న రోజు నుంచీ వైఎస్సార్సీపీ...

*కన్యకా పరమేశ్వరి ని దర్శించుకుని పూజలు నిర్వహించిన రాచమల్లు దంపతులు* 

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల  బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి**రాచమల్లు దంపతులను సాదరంగా ఆహ్వానించిన శ్రీ కన్యకా...
error: Content is protected !!