ePaper
Saturday, November 7, 2026
📄 ePaper

మద్దిగట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం ఏర్పాటు

📰 Generate e-Paper Clip

ఏకగ్రీవంగా నూతన అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి ఎన్నిక

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 07 2026: పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి, ఐ. సత్యరెడ్డి ఆదేశాల మేరకు పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కుప్పిరెడ్డి శివారెడ్డి, ఉపాధ్యక్షుడిగా వి. నరసింహాచారి, కార్యదర్శిగా జుంపాల ఆంజనేయులు, ముఖ్య సలహాదారుడిగా జె. నాగేష్ యాదవ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నూతన కార్యవర్గం సమష్టిగా కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు కె. సత్యరెడ్డి, రామచంద్రయ్య గౌడ్, మాజీ సర్పంచులు పి. నారాయణ, ఎం. కేశవులు, ఉపసర్పంచులు శివరాజు, కె. కేశవులు గౌడ్, మాజీ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోవర్ధన్ గౌడ్, కె. జనార్దన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగన్న యాదవ్, బుచ్చిలింగం తదితరులు పాల్గొన్నారు. అలాగే పార్టీ కార్యకర్తలు, సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Latest Articles

గార్ల -బయ్యారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక రైతుల గోస !

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్...

నవంబర్ 7న, మున్నేరు రైతు రక్షణ కమిటీ విస్తృత స్థాయి సమావేశం – కన్వీనర్ మూడు హరి నాయక్

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్...

వ్యవసాయ డ్రోన్ శిక్షణ-YTC భద్రాచలంలో ప్రారంభం  ఐ టి డి ఏ పిఓ బి రాహుల్ 

పొలిటికల్ పవర్ సమాగ్రా జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9/...

గార్ల మండల :JVV మండల అధ్యక్షుడి ఎన్నిక 

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్...

Related Articles

ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించిన తరువాతే ధాన్యం కేటాయించాలి

– మిల్లర్ల అక్రమాలకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి, – వనపర్తి జిల్లా అదనపు కలెక్టరుకు రాచాల వినతి, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి...

దేవరకద్ర నియోజకవర్గం లోని పలు అభివృద్ధి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

– కొత్తపల్లిలో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు, – అజ్జకొల్లు గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం, ఆత్మకూరులో ఎం జి1 ఈవీ వెహికల్స్...

ప్రభుత్వ విద్యకు మహర్దశ.. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి విద్యారంగ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యత.. విద్యాశాఖకు రూ.20 వేల కోట్ల కేటాయింపు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి...
error: Content is protected !!