ePaper
Thursday, November 12, 2026
📄 ePaper

గార్లలో అమృత భౌతికకాయానికి నివాళులర్పించిన సర్పంచ్ షేక్ సిద్దిక్, లలితా రవి దంపతులు  * బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. తగిన న్యాయం చేస్తామని హామీ కుటుంబానికి తీరని లోటు అని నాయకుల దిగ్భ్రాంతి

📰 Generate e-Paper Clip

ఖమ్మం / పాలేరు   నామ రాజేష్ కుమార్ (పొలిటికల్ పవర్ ):

పాలేరు నియోజకవర్గం ఎదూలాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేట సర్కిల్ వద్ద మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన పువ్వాడ ఉదయ్ నగర్ (5వ బ్లాక్) నివాసి అమృత మృతి పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

బుధవారం అమృత స్వగ్రామమైన గార్ల మండల పరిధిలోని కిష్టాపురం గ్రామానికి చేరుకున్న పువ్వాడ ఉదయ్ నగర్ సర్పంచ్ షేక్ సిద్దిక్, మాజీ సర్పంచ్ కాంపటి లలితా-రవి దంపతులు అమృత పార్థివదేహానికి పూలమాలలు వేసి అశ్రునయనాల మధ్య ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడిన అమృత భర్తను పరామర్శించి, ప్రమాద శైలిని, వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు తాము అండగా ఉంటామని భరోసానిచ్చిన నాయకులు, “ఈ కష్టసమయంలో ధైర్యంగా ఉండాలి.. మీకు చట్టపరంగా, ప్రభుత్వ పరంగా తగిన న్యాయం జరిగేలా చూసే బాధ్యత మాది” అని స్పష్టం చేశారు.

ఈ నివాళులర్పించిన వారిలో సీనియర్ నాయకులు కాంపటి రాంబాబు, పోలిపాంగు నాగేశ్వరరావు, కిషన్, గుర్రం మనోజ్ తదితరులు పాల్గొని అమృత ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

 

Latest Articles

అల్వాలలో 30 మంది రైతుల పంట నష్టం పరిశీలన

ఎంఏఓ సైదులు యాదవ్ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఏఈఓ సురేష్ కుమార్ ఎల్‌నినో...

ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త బోర్ల ఏర్పాటుపై విధానపరమైన నిర్ణయం తీసుకుంది

– ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని...

బీఆర్‌ఎస్‌లో అంతర్గత విభేదాలు.. పరస్పర విమర్శలు!

పార్టీకి రాజీనామా చేసిన వారు ఇప్పుడు కార్యకర్తలమంటూ మాట్లాడటం విడ్డూరం: జుజ్జురపు...

Related Articles

అమరవీరుల స్తూపం ప్రారంభోత్సవంటీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి నవంబర్ 12 పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్మంచిర్యాల జిల్లా సర్కిల్ కార్యాలయంలో ఈరోజు నూతనంగా నిర్మించిన అమరవీరుల స్తూపం...

చిప్పకుర్తి ఆర్ట్స్ అకాడమీ & హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి చిత్రకళా పోటీలుమంచిర్యాల జిల్లాలోని చిప్పకుర్తి ఆర్ట్స్ అకాడమీ & హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి‌ ఆన్లైన్ చిత్రకళా పోటీ...

వైఎస్ జగన్ వ్యూహంలో చిక్కుకున్న చంద్రబాబు..!

పొలిటికల్ పవర్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి  నాగరాజు రెడ్డిరాజకీయాల్లో పావులు కదపడం.. ఎత్తుకు పైఎత్తు వేయడం చాలా ముఖ్యం.చంద్రబాబు లాంటి నాయకుడ్ని ఢీకొనేటప్పుడు పక్కాగా వ్యూహం రచించాలి. పద్మవ్యూహం కంటే పదునైన, పకడ్బంది వ్యూహాన్ని...
error: Content is protected !!