ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeతెలంగాణకామారెడ్డిమద్నూర్ మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం

మద్నూర్ మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి జులై 29 2026: సర్వసభ్య సమావేశంలో స్పెషల్ ఆఫీసర్ గా రామ్మోహన్ రావు ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధికారులు సర్పంచ్లు కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఎంపీడీఓ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ… ఎల్ నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖలు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలి. ఈ సందర్భంగా మండలంలో నెలకొనే కాలానుగుణ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, వివిధ శాఖల సంసిద్ధతపై సమీక్ష నిర్వహించారు. అనంతరం స్పెషల్ ఆఫీసర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ… ఎల్ నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని అధికారులకు సర్పంచులకు ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ ఏఓ రాజు మాట్లాడుతూ… రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నాము ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. తాగునీటి సరఫరా, విద్యుత్, వైద్యం, పశుసంవర్ధక, పంచాయతీరాజ్ తదితర శాఖలు తమ తమ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధంగా ఉంచి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాభావం లేదా ఇతర ప్రతికూల పరిస్థితులు తలెత్తిన సందర్భంలో వెంటనే స్పందించే విధంగా శాఖలన్నీ అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమన్వయంతో పనిచేయాలని ఎంపీడీఓ సత్యనారాయణ రెడ్డి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!